38 మంది మృతి యెమెన్‌లో భీకర పోరు
- April 13, 2017
యెమెన్‌లో సైన్యానికి తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన పోరులో 38 మంది చనిపోయారు. ఓడరేవు నగరం మోచాపై పట్టుకోసం ప్రభుత్వ బలగాలు జరిపిన దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 38 మంది మృతి చెందినట్టు సమాచారం. యెమెన్‌లోని అబెద్ రబ్బో హన్సూర్ హడీ ప్రభుత్వానికి, షియా వర్గానికి చెందిన హుతీ తిరుగుబాటుదారులకు మధ్య రెండేళ్లుగా పోరు సాగుతోంది. దేశ రాజధాని సనా సహా కొన్ని ప్రాంతాలు హుతీ తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని తిరిగి చేజిక్కించుకునేందుకు పొరుగునే ఉన్న సౌదీ అరేబియా సాయంతో యెమెన్ ప్రభుత్వం పోరాటం సాగిస్తోంది. కాగా, తాజాగా జరిగిన మోచా ఘటనపై ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించటం లేదు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







