క్షమాభిక్ష కోసం 10 మంది భారతీయ వలసదారుల ఎదురుచూపులు
- April 13, 2017
అబుధాబి: భారతీయ వలసకార్మికులైన 10 మంది అల్ అయిన్ జైలులో మగ్గుతున్నారు. పాకిస్తానీ కార్మికుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వీరంతా, న్యాయస్థానం నుంచి క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 19వ తేఈకి ఈ కేసు విచారణ వాయిదా పడిందని అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు చెప్పారు. మృతుడి తండ్రి, కోర్టులో హాజరై, క్షమాబిక్షకి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చారు. ఇంకో వైపున ఇండియన్ ఛారిటీ ఆర్గనైజేషన్ నిందితుల తరఫున 200,000 బ్లడ్ మనీని కూడా బాధిత కుటుంబానికి అందజేసింది. సర్బత్ దా భాలా ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఎస్‌పిఎస్ ఒబెరాయ్ ఈ మొత్తాన్ని డొనేట్ చేశారు. ఈ కేసులో మొత్తం 10 మందికి మరణ శిక్ష విధించగా, ఒకరికి మాత్రం మరణ శిక్ష తప్పింది. మరణశిక్షను ఎదుర్కొనాల్సిన స్థితిలో దయనీయంగా జైల్లో మగ్గుతున్నవారంతా క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









