27 ఏళ్ళుగా భారతీయ వలసదారుడి కోసం 'వేట'
- April 13, 2017
మనామా: 27 ఏళ్ళ క్రితం ఇండియా నుంచి బహ్రెయిన్‌కి వచ్చిన ఓ వ్యక్తి ఆచూకీ అప్పటినుంచీ తెలియరావడంలేదు. 1987లో సాజిద్ పాషా అలియాస్ మొహమ్మద్ ఇస్మాయిల్ షరీఫ్ బహ్రెయిన్‌కి వచ్చారు. మూడేళ్ళ తర్వాత ఆయన ఇండియాకి తిరిగి వెళ్ళారు. ఇండియాలోనే ఉండిపోవాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరినా, ఇరాక్ యుద్ధం కారణంగా తనకు రావాల్సిన సొమ్ము బహ్రెయిన్‌లోనే ఉండిపోయిందని చెబుతూ తిరిగి ఇరాక్‌కి వెళ్ళిన సాజిద్ పాషా 1990 నుంచి ఆచూకీ లేకుండా పోయారు. ఇన్నేళ్ళలో మూడు సార్లు మాత్రమే తమతో ఆయన మాట్లాడారనీ, 1990 తర్వాత అతన్నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేదని సాజిద్ పాషా సోదరుడు ఇంతియాజ్ షరీఫ్ చెప్పారు. కుమారుడి మీద బెంగతో తన తల్లి అనారోగ్యం పాలైందనీ, ఆమె ఆసుపత్రిలో క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నారని ఆయన వాపోయారు. సాజిద్ పాషాకి సంబంధించి ఒకే ఒక్క ఫొటోగ్రాఫ్ అది కూడా పాతది మాత్రమే వారి దగ్గర ఉంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







