చిన్నారి అదితి కథ విషాదాంతం
- October 01, 2015
చిన్నారి అదితి కథ విషాదమయ్యింది. వారం కిందట విశాఖపట్టణం డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన ఆమె మృతదేహం విజయనగరం జిల్లా భోగాపురం సన్‌రే బీచ్‌లో లభించింది. ఏడురోజుల క్రితం ఇదే రోజున ఈ దుర్ఘటన జరిగింది. ఈ రోజు సాయంత్రం భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సందేహాల నడుమ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి అదితి కుటుంబీకులు, బంధువులు చేరుకున్నారు. మృతదేహంపై ఉన్న చెవిదిద్దులు, మెడలోని తాయత్తు తదితర ఆనవాళ్లతో అదితి భౌతిక కాయాన్ని ఆమె తండ్రి గుర్తించారు. అదితిని విగతజీవిగా చూసిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏడుస్తూ బంధువులు కుప్పకూలిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి అదితిని వెదికేందుకు ఖర్చుకు వెనుకాడకుండా ప్రయత్నాలు చేసింది.
యమ్.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి - బహ్రెయిన్).
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









