వర్కర్స్‌కి మాత్రమే అండ, బాస్‌లకి కాదు
- October 01, 2015
ఒప్పందాల ప్రకారం కార్మికులకు సెటిల్మెంట్ చేయకుండా, వారిని చిన్న చిన్న లూప్‌హోల్స్‌ని అడ్డం పెట్టుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్న సంస్థలను ఉపేక్షించబోమని మానవ వనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు నసర్ అల్ సది చెప్పారు. కంపెనీలపై వలస కార్మికులు ఫిర్యాదులు చేస్తే, వారి ఫిర్యాదుల్లో నిజాయితీని బట్టి చర్యలుంటాయని అన్నారు. అమ్నెస్టీ ద్వారా 21 వేల మంది వలస కార్మికులు సొంత దేశాలకు తరలి వెళ్ళారన్నారు. అక్టోబర్ 31 వరకూ అమ్నెస్టీ వలస కార్మికులకు అందుబాటులో ఉండనుంది. ఉద్యోగ కల్పనా రంగంలోని ఇబ్బందుల్ని గుర్తించామనీ, వాటిని సరిచేసి ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా చేస్తామన్నారు నసర్ అల్ నది. అమ్మెస్టీ సహాయంతో 14 వేల మందికి పైగా బంగ్లాదేశీయులు స్వదేశానికి వెళ్ళినట్లు బంగ్లాదేశ్ ఎంబసీ చెప్పింది. పాకిస్తాన్‌కు 4 వేల మంది వెళ్ళగా, సుమారు 3 వేల మంది అమ్నెస్టీకి దరఖాస్తు చేసుకుని ఉన్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







