వందలాది మంది మృతి అమెరికా దాడిలో
- April 13, 2017
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడిలో వందలాది మంది మృతి చెందారని సిరియా సైన్యం వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా డెయిర్ ఇజ్-జోర్‌పై సంకీర్ణ సేనలు బుధవారం జరిపిన ఈ దాడిలో భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మృతి చెందారని సిరియా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆర్మీ జనరల్ కమాండ్ పేరుతో వెల్లడించిన ప్రకటనలో.. అమెరికా సేనల దాడిలో హాల్టా గ్రామం వద్ద భారీగా విష రసాయనాలు విడుదలయ్యాయని పేర్కొంది. దీంతో అక్కడ ఉన్న వందలాది మంది పౌరులు మృతి చెందారని వెల్లడించింది. విష వాయువుల వల్ల ఊపిరాడకపోవడం మూలంగా వీరంతా మృతి చెందారని సిరియా సైన్యం పేర్కొంది. కాగా.. సిరియా ప్రభుత్వం రసాయన దాడికి పాల్పడిందని ఆరోపిస్తూ సిరియన్ ఎయిర్‌బేస్‌పై ఇటీవల భారీ సంఖ్యలో క్షిపణులతో అమెరికా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







