దుబాయ్‌ చరిత్రలో మరో కొత్త రికార్డ్‌

- April 14, 2017 , by Maagulf
దుబాయ్‌ చరిత్రలో మరో కొత్త రికార్డ్‌

2017 సంవత్సరాన్ని 'ఇయర్‌ ఆఫ్‌ గివింగ్‌'గా భావిస్తున్న నేపథ్యంలో దుబాయ్‌లోని సిఖ్‌ టెంపుల్‌ ఒకటి, ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. 600 మందికి 'బ్రేక్‌ఫాస్ట్‌'ని అందించింది. 101 దేశాలకు చెందినవారు గంట పాటు సాగిన ఈ బ్రేక్‌ ఫాస్ట్‌లో తమ తమ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. జబెల్‌ అలి ప్రాంతంలోని టెంపుల్‌ దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిథులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి, ఈ కార్యక్రమానికి గిన్నీస్‌ బుక్‌లో చోటు కల్పించారు. గతంలో 55 దేశాలకు చెందినవారికి కాంటినెంటల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అందించింది. నూటెల్లా నిర్వహించిన ఈ కార్యక్రమం ఇటలీలోని మిలాన్‌ ఎక్స్‌పో వద్ద సెప్టెంబర్‌ 13, 2015లో జరిగింది. ముందస్తు రిజిస్ట్రేషన్‌ ద్వారా ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రవేశం కల్పించారు. స్కూలు విద్యార్థులు, డిప్లమాట్స్‌, ప్రభుత్వ అధికారులు, సామాన్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యూఏఈలో 50 వేల మందికి పైగా విజిటర్స్‌కి భోజన సౌకర్యం కల్పిస్తోంది. ఈ గొప్ప కార్యక్రమానికి ఆ దైవ సహకారం తోడయ్యిందని సంస్థ ప్రతినిథులు తెలిపారు. మామూలు రోజుల్లో 1000 మందికి, వారాంతాల్లో, సెలవు దినాల్లో 10,000 మందికి గురుద్వారా భోజన సౌకర్యం కల్పిస్తోందని వారు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com