క్షమాభిక్షతో సంతోషంగా ఇండియాకి పయనం

- April 14, 2017 , by Maagulf
క్షమాభిక్షతో సంతోషంగా ఇండియాకి పయనం

జెడ్డా: క్షమాభిక్ష దొరుకుతుందా? లేదా? అన్న టెన్షన్‌ నడుమ జీవితం కష్టంగా సాగిందనీ, క్షమాభిక్ష రావడంతో సంతోషంగా ఇండియాకి వెళుతున్నానని మానికం అర్ముగం అన్నారు. కాలుని కోల్పోయిన తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందనీ, ఈ పరిస్థితుల్లో తాను ఇండియాకి తిరిగి వెళ్ళగలనని అనుకోలదని, ఆశ కోల్పోయిన దశలో తనకు క్షమాభిక్ష ఓ వరంలా కనిపించిందని చెమర్చిన కళ్ళతో అర్ముగం చెప్పారు. తమిళనాడులోని తంజావూరుకి చెందిన అర్ముగమ్‌, సెట్రల్‌ వెజిటబుల్‌ మార్కెట్‌లో పోర్టర్‌గా పనిచేశారు. స్పాన్సరర్‌ నుంచి ఎస్కేప్‌ అయి, జెడ్డాలోని ఫ్యూయల్‌ స్టేషన్‌లో కొన్నాళ్ళు ఆర్ముగం పనిచేశాడు. ఓ రోజు దురదృష్టవశాత్తూ వేగంగా దూసుకొచ్చిన కారు అతన్ని ఢీకొనడంతో, ఆయన తన కాలుని కోల్పోయాడు. జెడ్డా తమిళ సంఘం, సెంతమిల్‌ నాలా మంద్రమ్‌ సహా పలు సంస్థలు అతనికి సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. తమిళనాడులో అతనికి తగిన ఆర్థిక సహాయం అందిస్తామని కమ్యూనిటీ వర్కర్స్‌ సహెర్‌ పాండియన్‌, మొహమ్మద్‌ సిరాజ్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com