నాగచైతన్య సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా

- April 17, 2017 , by Maagulf
నాగచైతన్య సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా

అన్ని క్యారెక్టర్లు చేస్తేనే కళాకారుడికి గుర్తింపు
ఇతర భాషా చిత్రాల్లో నటిస్తే మరింత ప్రాచుర్యం
చదువు కోసం రోషన్‌కి మూడేళ్లు గ్యాప్‌: సినీ హీరో శ్రీకాంత్‌
కాకినాడ: చలనచిత్ర రంగంలో కళాకారుడిగా గుర్తింపు రావాలంటే అన్ని క్యారెక్టర్లు చేస్తేనే గుర్తింపు వస్తుందని సినీహీరో శ్రీకాంత్‌ పేర్కొన్నారు. అవకాశాలు వచ్చినప్పుడు హీరోలుగా నటించినంత మాత్రాన మిగతా క్యారెక్టర్లలో నటించకూడదని నిబంధనేమీ కళాకారుడు పెట్టుకోకూడదన్నారు. రియల్‌ఎస్టేట్‌ రంగంలో పేరు సంపాదిస్తున్న ప్రకృతి ఎవెన్యూస్‌ సంస్థ నూతన వెంచర్‌ ఇంద్రప్రస్ధ వెంచర్‌ను ఆయన ఆదివారం ప్రారంభించగా చలనచిత్ర రంగంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు అటు కథానాయకుడిగా, ఇటు క్యారెక్టర్‌ యాక్టర్‌గా ప్రతి నాయకుడిగా చేస్తున్న విషయాలపై శ్రీకాంత్‌ 'ఆంధ్రజ్యోతి'తో ముచ్చటించారు. ప్రస్తుతం తాను తెలుగులో రారా, నాటుకోడి అనే చిత్రాల్లో హీరోగా నటిస్తున్నానన్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రంలో విలన్‌గా నటిస్తున్నానన్నారు. కేరళలో మోహన్‌లాల్‌ హీరోగా తీస్తున్న చిత్రంలో క్యారెక్టర్‌ యాక్టర్‌గా నటిస్తున్నానన్నారు. కన్నడంలో సుదీప్‌ హీరోగా తీస్తున్న చిత్రంలో ప్రతినాయకుని క్యారెక్టర్‌లో కూడా నటిస్తున్నానన్నారు.
తన కుమారుడు రోషన్‌ చిత్రరంగ ప్రవేశంపై మాట్లాడుతూ నిర్మలా కాన్వెంట్‌ చిత్రం ద్వారా రోషన్‌ పరిచయమయ్యాడని, చదువు కోసం మూడేళ్లు గ్యాప్‌ ఇచ్చామన్నారు. తర్వాత సినిమాల్లో కంటిన్యూ అవుతారన్నారు. ప్రకృతి ఎవెన్యూస్‌ సంస్థతో మీకున్న అనుబంధమేమిటని ప్రశ్నించగా తాను ఈ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంజిబాబుతో ఉన్న స్నేహసంబంధంతోనే ఇక్కడకు వచ్చానని, సంస్థతో తనకు ఎటువంటి భాగస్వామ్యం లేదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com