ఐపీఎల్ 2017: అవార్డుల జాబితా, టైటిల్ విజేతకు భారీ నజరానా
- April 17, 2017
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో టైటిల్ విజేతగా నిలిచిన జట్టు రూ. 15 కోట్లు ప్రైజ్ మనీని అందుకోనుంది. అదే రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 10 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది. ఇలా ఐపీఎల్లో ఎన్నో అవార్డులను ఆయా జట్లు అందుకోనున్నాయి.
ఐపీఎల్ 2017లో భాగంగా జరుగుతున్న టోర్నీలో 60 మ్యాచ్‌ల్లో విజేతలుగా నిలిచిన ఆటగాళ్లకు వివిధ రకాల బహుమతులను నిర్వహకులు అందజేయనున్నారు. మే 21వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫైనల్స్ జరగనుంది. ఐపీఎల్ 2017 పూర్తి అవార్డుల జాబితా:
1. ఐపీఎల్ 2017 విన్నర్‌కి ట్రోఫీతో పాటు రూ. 15 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. దీంతో పాటు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా మెమొంటోలను అందుకుంటారు.
2. ఐపీఎల్ 2017 రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 10 కోట్లు ప్రైజ్ మనీ లభించనుంది. దీంతో పాటు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా మెమొంటోలను అందుకుంటారు.
3. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ (లీగ్ గేమ్స్) - రూ. 1 లక్ష, ట్రోఫీ
4. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ (ప్లే ఆఫ్స్) - రూ. 5 లక్షలతో పాటు ట్రోఫీ
5. VIVO మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ - రూ. లక్ష, ట్రోఫీ, VIVO ఫోన్
6. VIVO సీజన్లో అద్భుతమైన క్యాచ్ - రూ. 10 లక్షలు ట్రోఫీ, VIVO ఫోన్
7. YES Bank మ్యాక్సిమమ్ సీజన్ అవార్డు - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
8. వోడాఫోన్ సూపర్ ఫాస్ట్ ఫిప్టీ అవార్డు - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
9. విటారా బ్రిజ్జా గ్లామ్ షాట్ ఆఫ్ ద సీజన్ - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ, బ్రెజ్జా కారు
10. FBB స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
11. YES Bank మ్యాక్సిమమ్ సిక్సులు (మ్యాచ్‌లో) - రూ. 1 లక్ష, ట్రోఫీ
12. FBB స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ద డే (మ్యాచ్‌లో) - రూ. 1 లక్ష, ట్రోఫీ
13. ఆరెంజ్ క్యాప్ (టోర్నీలో అత్యధిక పరుగులు) - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
14. పర్పెల్ క్యాప్(టోర్నీలో అత్యధిక వికెట్లు) - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
15. ఫెయిర్ ప్లే అవార్డు - జట్టుకు ట్రోఫీ
16. ఎమెర్జింగ్ ప్లేయర్ అవార్డు - రూ. 10 లక్షలు
17. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









