బ్రిటన్ రాజధాని నైట్ క్లబ్లో యాసిడ్ దాడి
- April 17, 2017
లండన్: బ్రిటన్ రాజధాని లండన్ ప్రజలు యాసిడ్ దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం తెల్లవారుజామున కిక్కిరిసిన ఓ నైట్ క్లబ్లో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన యాసిడ్ దాడిలో 12 మంది గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, ఈ దాడిలో ఉగ్రవాదులకు సంబంధముందని భావించడం లేదని పోలీసులు తెలిపారు.
దాడి జరిగిన సమయంలో నైట్ క్లబ్లో దాదాపు 600 మంది ఉన్నారు. నైట్ క్లబ్లో ఉన్నవారిపై గుర్తు తెలియని ప్రమాదకర పదార్థాన్ని చెల్లారని లండన్ ఫైర్ బ్రిగేడ్ ప్రతినిధి చెప్పారు. పరీక్షల్లో ఇది ఓ ఆమ్ల పదార్థంగా తేలిందని ఆయన తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులకు సమాచారం రావడంతో వారు ఘటన స్థలానికి వెళ్లి, క్లబ్‌కు వెళ్లే దారులన్నీ మూసివేయించి విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. 2010 తర్వాత లండన్‌లో యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. దాదాపు 1800 కేసులు నమోదయ్యాయి. కొన్ని క్రిమినల్ గ్యాంగులు ఈ దాడులు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల లండన్‌లోనే జరిగిన యాసిడ్ దాడిలో భార్యాభర్తలు, వారి మూడేళ్ల కొడుకు గాయపడ్డారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







