హైదరాబాద్ హోటల్ స్వాగత్ లో కుళ్లిన మాంసం బిర్యాని.. 10వేలు ఫైన్

- April 18, 2017 , by Maagulf
హైదరాబాద్ హోటల్ స్వాగత్ లో కుళ్లిన మాంసం బిర్యాని.. 10వేలు ఫైన్

మనిషి ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు కల్తీనే.. తినే తిండి కల్తీ.. వస్తువులు కల్తీ.. పండ్లు కల్తీ.. ఇక తాజాగా హోటల్స్ కూడా తమ వంటలను కుళ్లిన కూరగాయలు, చికెన్ లతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని వివిధ హోటల్స్ పై రైడ్ జరుపుతూ.. పన్నులు విధిస్తున్న సంగతి విధితమే.. తాజాగా నిన్న ఐదుగురు వ్యక్తులు వనస్థలిపురం స్వాగత్ గ్రాండ్ హోటల్ లో కుళ్లిన మాసం పెడుతున్నారంటూ యజమాన్యంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు.. ఈ ఫిర్యాదుతో పాడైపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన టమాటాలు నిన్నటి అన్నం వేడి చేసి పెడుతూ ఆ హోటల్ కష్టమర్లను మోసం చేస్తున్నదని పేర్కొన్నారు.. 
కొంగరకలాన్ కు చెందిన ఐదుగురు వనస్థలిపురం స్వాగత్ గ్రాండ్ హోటల్ కు బిర్యానీ తినడానికి వెళ్ళగా పాడై పోయిన మటన్ తో చేసిన బిర్యాని పెట్టడంతో ఈ యువకులు ఫిర్యాదు చేశారు.. హోటల్ లో తనిఖీలి నిర్వహించిన జీహెచ్ ఎంసి అధికారులు తనిఖీలు నిర్వహించి 10 వేల ను జరిమానా విధించారు.. ఇంకా అక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com