ఆచూకీ లేని భారతీయ కార్మికుడు శలాలహ్ మసీదు వద్ద కనుగొన్నారు
- April 18, 2017
ఘాల శిబిరం నుండి రెండు నెలల క్రితం తప్పిపోయిన ఓ భారతీయ కార్మికుడిని శలాలహ్ మసీదు వద్ద అనూహ్యంగా కనుగొన్నారు. మస్కట్ డైలీ పత్రికలో మార్చి 6 న ఈ కార్మికుడు గురించి ప్రచురించారు. అశుతోష్ ధాల్ అనే 28 ఏళ్ళ యువకుడు భారతదేశంలో తూర్పు రాష్ట్రమైన ఒడిషాకు చెందినవాడు. ఎక్కడకు వెళ్లాడని అందరు భావిస్తున్న సమయంలో అకస్మాత్తుగా శలాలః ఒక మసీదు వద్ద దర్శనమిచ్చారు. అశుతోష్ ధాల్ తో పాటు పనిచేసే సంస్థకు చెందిన కొందరు కార్మికులు అతన్ని గుర్తించారు. మస్కట్ లో ఉంటున్న అశుతోష్ ధాల్ యొక్క స్నేహితుడు వినోద్ బిహారీ పరిడను సంప్రదించారు. పరిడ మస్కట్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఇతర సంస్థల ద్వారా ఈ కేసు విషయమై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా పరిడ మస్కట్ డైలీతో మాట్లాడుతూ, తానూ అశుతోష్ పోలిక ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక కార్మికుని ద్వారా సమాచారం అందుకొన్నానని , నేను వెంటనే వాట్స్ అప్ ద్వారా ఆ వ్యక్తి ఫోటో పంపమని ఆ కార్మికుదీని కోరినట్లు తెలిపానన్నారు. ఫోటో వచ్చిన వెంటనే ఆ వ్యక్తిని పరిశీలనగా చూస్తే ఆ వ్యక్తిని నేను గుర్తించాను అతనే అశుతోష్ ధాల్ నేను అశుతోష్ తో మాట్లాడాలి ఫోన్ అతనికి అందచేయమని ఆ కార్మికుడిని అడిగి నేను ధాల్ తో మాట్లాడాను. తానూ బాగానే ఉన్నట్లు పేర్కొంటూ. అయితే చాలా ఒత్తిడికి గురైనట్లు తెలిపాడన్నారు. మస్కట్ డైలీ అశుతోష్ ధాల్ ను సంప్రదించగా, తనను కొంతమంది బెదిరించారని దాంతో ఒక బస్సుఎక్కి ఆ నగరం వదిలివచ్చినట్లు పేర్కొన్నాడు.ఆ తర్వాత శలాలః వచ్చి సరైన ఆహారం లేకుండా రోజులు గడిపినట్లు చెబుతూ ఆ తర్వాత తానూ ఒక మసీదు వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. నేను భారతదేశం తిరిగి వెళ్లిపోవాలనుకొంటున్నాను మరియు నా కుటుంబంను కలవడానికి ఎంతో ఆశపడుతున్నట్లు అశుతోష్ ధాల్ తెలిపారు. అశుతోష్ ధాల్ స్నేహితుడు భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, సహాయం కోరుతూ ట్వీట్ చేసినట్లు తెలిపారు. మరియు మస్కట్ భారత ఎంబసీ లో ఈ ఫిర్యాదు నమోదైంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







