దుబాయ్ లో మైక్ టైసన్ అంతర్జాతీయ అకాడమీ ఏర్పాటు ప్రకటించిన మైక్ టైసన్
- April 18, 2017
అంతర్జాతీయ బాక్సింగ్ చిహ్నం.. తిరుగులేని ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ వీరుడు తన కొత్త వ్యాపార వెంచర్, ఫిట్నెస్ సెంటర్లు ఫ్రాంచైజ్ ఏర్పాటు కోసం దుబాయ్ ఎంచుకున్నారు. 20 సంవత్సరాల వయస్సులోనే డబ్ల్యు బి ఎ , డబ్ల్యు బి సి మరియు ఐ బి ఎఫ్ హెవీ వెయిట్ టైటిల్స్ గెలిచిన అతి పిన్న బాక్సర్ గా పలు రికార్డులు స్వంతం చేసుకొన్నారు. దుబాయ్ లోఅంతర్జాతీయ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు మైక్ టైసన్ అధికారిక ప్రకటన చేశారు. మైక్ టైసన్ అంతర్జాతీయ అకాడమీ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది, ఇప్పటికే బాక్సింగ్ శిక్షణ కోసం ఎన్నో దేశాలు అంతర్జాతీయ ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, పశ్చిమ ఆఫ్రికా చైనాలో ప్రారంభించడానికి అకాడమీ సన్నాహాలు చేస్తుంది.ఈ మైలురాయిని ప్రకటన చేయడానికి దుబాయ్ నే ఎందుకు ఎంచుకున్నారని మైక్ టైసన్ అడిగినప్పుడు అందుకు ఆయన జవాబిస్తూ, దుబాయ్ ప్రముఖ క్రీడా సంఘటనలు మరియు ఎన్నో క్రీడా చిహ్నాలకు ముఖ్య వేదికగా ఉందన్నారు. ఎన్నో ఆవిర్బాలకు ప్రపంచ పటం మీద ఆతిధ్యమిస్తుందని ప్రశంసిస్తూ అందుకే దుబాయ్ లో స్థాపించడానికి ఎంచుకొన్నట్లు ఆయన తెలిపారు. ఉత్తమ క్రీడా నాణ్యతతో కూడిన ఒక ఫిట్నెస్ సెంటర్ కోసం అవకాశమిస్తున్నారని తమ మైక్ టైసన్ అంతర్జాతీయ అకాడమీ మార్కెట్ లో ఒక చైతన్యాన్ని ఖచ్చితంగా నింపుతుందని టైసన్ అన్నారు. మైక్ టైసన్ అంతర్జాతీయ అకాడమీ ఇతర సంప్రదాయ కేంద్రాలు కంటే ఉత్తమ శిక్షణని అందిస్తున్నాయి తమ అకాడమీలో నిరంతర కృషి మరియు క్రమశిక్షణ మైక్ యొక్క సిద్ధాంతమని అందుకు అకాడమీ సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉంటుంది. ఈ కేంద్రాలలో వివిధ తరగతులలో గుండె, శక్తి, నిర్వహణ శిక్షణ ఇవ్వడమే కాక బాక్సింగ్ రింగ్ లో ఒక పూర్తి స్థాయితిరుగులేని వీరుడిగా తీర్చిదిద్దుతామని మైక్ టైసన్ వివరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







