జెడి చక్రవర్తి, అమ్మరాజశేఖర్‌ల 'ఉగ్రం' పోస్టర్ విడుదల
- April 19, 2017
నక్షత్ర మీడియా పతాకంపై జెడి చక్రవర్తి, అక్షిత జంటగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి 'ఉగ్రం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇటీవలే 'ఉలవచారు' రెస్టారెంట్‌లో ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెడి చక్రవర్తి, అమ్మ రాజశేఖర్, హీరోయిన్ అక్షిత, బెనర్జీ, గౌతం రాజు, చమ్మక్‌చంద్ర, ఆజాద్, జబర్ధస్త్ ఆర్కే తదితరులు పాల్గొన్నారు. పోస్టర్‌ని ఎమ్మెల్యే వేణుగోపాలచారి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ..'మా గురువు గారు జెడి చక్రవర్తి హీరోగా నేను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ఉగ్రం' అనే టైటిల్‌ని ఖరారు చేశాము. ఇదొక వెరైటీ సబ్జెక్ట్. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంకా 10 రోజులు షూటింగ్ జరుపుకుని, వచ్చే నెల మొదటివారంలో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌ని జరుపనున్నాం...అని అన్నారు.
'ఉగ్రం' చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. థమన్, కెమెరా: అంజి, ఎడిటింగ్: గౌతంరాజు, ప్రొడ్యూసర్: నక్షత్ర రాజశేఖర్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అమ్మ రాజశేఖర్.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







