నెలరోజుల పాటు సందడి చేయనున్న ప్రవాసీయ భారత క్రికెట్ టోర్నమెంట్
- April 19, 2017
మనామా: భారతదేశంలో అంతర్జాతీయ ఐ ప్ ఎల్ క్రికెట్ పోటీలు సందడి చేస్తుండగా, ప్రవాస భారతీయులు మరోవైపు ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ తామేమి తీసిపోమన్నట్లుగా నిరూపిస్తున్నారు. భారత క్లబ్ భారతీయ ప్రవాసీయులు సెవెన్-ఎ-సైడ్ సాఫ్ట్ బాల క్రికెట్ టోర్నమెంట్ 2017 నెలరోజుల టోర్నమెంట్ ప్రారంభంకానుంది. ప్రారంభోత్సవ వేడుక గుదైబియా లోని ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంపై క్లబ్ సభ్యులు, అతిథులు మరియు టోర్నమెంటులో పాల్గొనే జట్లు హాజరయ్యారు. గ్రూప్ దశలో ప్రారంభ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బి సి జి క్రికెట్ జట్టు 5 ఓవర్ల ఒక బంతికి కేవలం17 పరుగులను చేయగా, ఆ లక్ష్యాన్ని చేధించడానికి సూపెర్నేట్ కార్గో బ్యాటింగ్ కు దిగి పరుగుల వర్షం కురిపించారు రెండు ఓవర్లు పూర్తి కాకుండానే ప్రత్యర్థి స్కోర్ చేసిన మొత్తాన్ని దాటివేశారు..ఒక ఓవర్ మూడు బంతులతో విజయలక్ష్యాన్ని చేరుకొన్నారు. ఆ తర్వాత జరిగిన రెండవ మ్యాచ్ వినాల్ క్రికెట్ క్లబ్ , బేహారిన్ బ్లూస్ జట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బేహారిన్ బ్లూస్ 5 ఓవర్ల మూడు బంతులతో 27 పరుగులు చేశారు. ఆ లక్ష్యాన్ని చేధించేందుకు వినాల్ క్రికెట్ క్లబ్ ఆటగాళ్లు 5 ఓవర్ల ఒక్క బంతికె 30 పరుగులు స్కోరు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







