కన్నడిగులకు రాజమౌళి విజ్ఞప్తి..!
- April 20, 2017
బాహుబలి పార్ట్ 2 రిలీజ్ పై కన్నడ ప్రజలు స్పందిస్తున్న తీరు నిర్మాత దర్శకులను ఇబ్బంది పెడుతోంది. సినిమా విడుదలను అడ్డుకోవద్దంటూ చిత్ర దర్శకుడు రాజమౌలి కన్నడిగులకు విజ్ఞప్తి చేశారు. తన సోషల్ మీడియా పేజ్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కన్నడలో మాట్లాడి వారికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేశాడు.
చాలా ఏళ్ల క్రితం సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సినిమాను అడ్డుకోవద్దని కోరారు. ఆ వ్యాఖ్యలు కేవలం సత్యరాజ్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని, వాటితో బాహుబలి యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సినిమా కోసం ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పని చేశారు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి రెండో భాగాన్ని కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







