జిటెక్స్‌ షాపర్‌ 2015లో అద్భుతమైన ఆఫర్లు

- October 02, 2015 , by Maagulf
జిటెక్స్‌ షాపర్‌ 2015లో అద్భుతమైన ఆఫర్లు

దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో జిటెక్స్‌ షాపర్‌ 2015 ఈ రోజు ప్రారంభం కానుంది. పాతికేళ్ళ క్రితం జిటెక్స్‌ షాపర్‌ ప్రస్తానం ప్రారంభమైంది. ప్రతి యేడాదీ వినియోగదారుల్ని ఆకర్షించడంలో రికార్డులు సృష్టిస్తున్న జిటెక్స్‌, ఈసారి మరింత సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యింది. 3 మిలియన్ల దీనార్లు గెలుచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది జిటెక్స్‌ షాపర్‌. ఎనిమిది రోజులపాటు సాగే జిటెక్స్‌ షాపర్‌లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ప్రతిరోజూ కిలోగ్రామ్‌ బంగారం బంపర్‌ డ్రాలో గెలుచుకునే అవకాశం కూడా నిర్వాహకులు కల్పిస్తున్నారు. అమిటీ యూనివర్సిటీ, విద్యార్థులు యూనివర్సిటీ స్కాలర్‌ షిప్‌ పొందే అవకాశాన్ని కల్పిస్తుండడం ఇంకోవ ఇశేషంగా చెప్పవచ్చును. తమ బెస్ట్‌ రిపోర్ట్‌ కార్డ్స్‌ని ఏ రోజుకి ఆ రోజు షాపర్‌ని సందర్శించిన సమయంలో డ్రాప్‌ చేయవచ్చని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఇంకెందుకు ఆలస్యం, తక్కువ వడ్డీతో ఉపకరణాల్ని సొంతం చేసుకోవడానికీ, బంగారం, నగదు, స్కాలర్‌షిప్‌ గెలుచుకోవడానికీ జిటెక్స్‌ షాపర్‌కి రెడీ అయిపోండి.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com