కువైట్ లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- April 20, 2017
కువైట్ లోని SVS Cargo ఆఫీసు ప్రాంగణంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మరియు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 68వ జన్మదిన వేడుకలను తెలుగు దేశం -కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమం లో ప్రసంగించిన తెలుగుదేశం-కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకరరావు ntr ఆదర్శంగా మరియు చంద్రబాబు నాయుడు స్ఫూర్తి తో కువైట్ లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, మన రాష్ట్రం కనీసం రాజధాని కూడా లేకుండా విడిపోతే చంద్రబాబు పరిపాలన చాతుర్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ఆయన చేస్తున్న కృషి మరువలేనిదని తెలిపారు.
అలాగే ఇంద్రాణి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత ఇంద్ర కుమార్ రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా మన అదృష్టం అని ఆయన రాష్ట్రాన్ని చరిత్ర పుటల్లో అగ్రస్థానంలో నిలుపుతారని 2019 లో కూడా ఆయననే ముఖ్యమంత్రి గా చేయడానికి మనందరం కృషి చేయాలని వచ్చిన సభ్యులను కోరారు. ఈ కార్యక్రమం లో ప్రవాస కాపు బలిజ సేవా సంఘం అధ్యక్షులు మరియు తెలుగు కువైట్ వెల్ఫేర్ కో.ఆర్డినేటర్ మురళి మరియు P.R.Oఈశ్వర్ నాయుడు మరియు మీడియా కో ఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమం లో గల్ఫ్ వైడ్ నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షులు వేగి వెంకటేష్ మరియు నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు పట్టాభిరామ మరియు ఆంధ్రాయూత్ కార్యవర్గ సభ్యులు మరియు తెలుగు దేశంకువైట్ సభ్యులు సుబ్బారెడ్డి,ముస్తాక్,విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.







తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







