భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ట్రంప్ ప్రభుత్వానికి
- April 21, 2017
హెచ్-1బీ వీసాల్లో కఠినతరమైన నిబంధనలపై భారత్ ఆగ్రహించింది. ఈ నిబంధనలపై ట్రంప్ ప్రభుత్వంతో చర్చోపచర్చలు జరుపుతున్నా వారు తలొగ్గకపోవడంతో ఆ ప్రభుత్వానికి భారత్ గట్టి హెచ్చరికలు జారీచేసింది. అమెరికా కంపెనీలు కూడా భారత్లో వ్యాపారం చేస్తున్నాయని, ఆ విషయాన్ని అమెరికా అథారిటీలు దృష్టిలో ఉంచుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వార్నింగ్ ఇచ్చారు.
''కేవలం భారత కంపెనీలు మాత్రమే అమెరికాలో లేవు. పెద్ద పెద్ద అమెరికా కంపెనీలు కూడా భారత్లో ఉన్నాయి.వారు భారీ ఎత్తున్న భారత్ మార్కెట్లో ఆదాయాలు ఆర్జిస్తున్నారు. ఆ ఆదాయాలను అమెరికా ఆర్థికవ్యవస్థకు తీసుకెళ్తున్నారు. అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో కేవలం భారత్ కంపెనీలే ప్రభావితం కావు. కొన్నేళ్లుగా భారత్లో వ్యాపారాలు చేస్తున్న పెద్దపెద్ద అమెరికా కంపెనీలపై కూడా ప్రభావం పడుతుంది. ఒకవేళ ఈ వీసా ఆందోళనలు ఇలానే కొనసాగిస్తే, మేము వాటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటాం. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని మీరు వ్యవహరించాలి'' అని నిర్మలా సీతారామన్ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అన్యాయకరమైన ధోరణిని తాము అంగీకరించేది లేదంటూ నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. భారత్ ఐటీ కంపెనీలకు భారీ షాకిస్తూ.. వీసా నిబంధనలు కఠినతరంపై డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై స్పందించిన మంత్రి ట్రంప్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వీసా నిబంధనల్లో మార్పులపై ఐటీ కంపెనీల ఆందోళనలను భారత్ ట్రంప్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. వారు తలొగ్గడం లేదు. దీంతో మంత్రి సీరియస్ అయ్యారు. ఆ దేశ కంపెనీలు కూడా భారత్ లో ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







