కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ప్రారంభం
- April 21, 2017
తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ప్లీనరీ హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం కేసీఆర్ ప్రారంభోపన్యాసంతో ప్లీనరీ ప్రారంభమైంది. తెరాస అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. రాష్ట్రంలో పలు రాజకీయ పరిణామాల నడుమ, ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు మాత్రమే మిలిగి ఉన్న సమయంలో జరుగుతున్న ఈ ప్లీనరీకి పార్టీ ఎంతో ప్రాధాన్యమిస్తోంది. మూడేళ్ల పాలనను సమీక్షించడంతో పాటు వచ్చే రెండేళ్ల కార్యాచరణను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీ ప్రాంగణంలో ప్రకటించనున్నారు. మొదట్లో ప్లీనరీ, తెరాస ఆవిర్భావ దినోత్సవాలు ఒకేరోజు జరిగేవి. పార్టీ కార్యక్రమాల విస్తృతిలో భాగంగా ప్లీనరీ, సభను విడివిడిగా జరుపుతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. దానికి సన్నాహంగా ప్లీనరీ నిర్వహించాలని తెరాస నిర్ణయించింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







