ఇటాలియన్‌ బ్రెడ్‌ సలాడ్‌

- April 21, 2017 , by Maagulf
ఇటాలియన్‌ బ్రెడ్‌ సలాడ్‌

కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి: ఒక రెమ్మ 
ఇటాలియన్‌ బ్రెడ్‌ లేదా బ్రౌన్‌బ్రెడ్‌ : ఐదు స్లైసులు 
టొమోటోలు : ఒక కప్పు (తరిగిన) 
కీర : ఒక కప్పు (తొక్కతీసి సన్నగా తరిగినవి) 
రెడ్‌ ఆనియన్‌ : ఒక కప్పు (తరిగినవి) 
తులసి ఆకులు : రెండు కప్పులు (తరిగినవి) 
ఆలివ్‌ ఆయిల్‌ : పావు స్పూను 
బాల్‌సమిక్‌ వెనిగర్‌ : రెండు టేబుల్‌ స్పూన్లు
 తయారీ విధానం
కలపతో చేసిన బౌల్‌ను తీసుకుని వెల్లుల్లి రెమ్మల్ని మెత్తగా చిదిమేయాలి. చిన్న చిన్న పీసులుగా కట్‌ చేసుకున్న బ్రెడ్‌ ముక్కల్ని బౌల్‌లోకి వేసుకోవాలి. టొమాటో, కీర, రెడ్‌ ఆనియన్‌, అల్లం, తులసి తరుగును కలపాలి. చివర్లో ఆలివ్‌ ఆయిల్‌, ఒక చుక్క వెనిగర్‌.. అవసరం అనుకుంటే చిటికెడు ఉప్పు, కారం, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. అన్నీ వేసిన తరువాత బాగా కలియబెట్టాలి. ఈ సలాడ్‌ తింటే వేసవిలో హాయిగా ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com