మీన్ వరుతరాచ
- April 22, 2017
కావలసిన పదార్థాలు: ఫిష్ - 500 గ్రా
గ్రైండింగ్ కోసం: పచ్చి కొబ్బరి - 1 కప్పు, ఉల్లిపాయలు - 2, వెల్లుల్లి - 1 టీస్పూను, కారం - 1 టే.స్పూను, ధనియాల పొడి - 1 టే.స్పూను, మిరియాల పొడి - 1 టీస్పూను, మెంతులు - 1 టీస్పూను, కరివేపాకు - 2 రెమ్మలు
గ్రేవీ కోసం: అల్లం తురుము - 1 టీస్పూను, వెల్లుల్లి- అర టీస్పూను, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయలు - 2, పసుపు - 1 టీస్పూను
కోకుం - 3 (ఎండిపోయి ఉంటే వేడి నీళ్లలో 10 నిమిషాలు నానబెట్టాలి), టమేటా - 1, కరివేపాకు - 1 రెమ్మ, కొబ్బరి నూనె - ఉప్పు.
తయారీ విధానం: బాండీ వేడిచేసి గ్రైండింగ్ కోసం చెప్పిన దినుసులన్నీ (కారం, ధనియాల పొడి, కరివేపాకు) వేయించుకోవాలి. కొబ్బరి రంగు మారాక, కారం, ధనియాల పొడి, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించి చల్లారాక నీరు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. అదే బాండీలో నూనె వేడిచేసి అర టే.స్పూను వెల్లుల్లి తరుగు, 1 టీస్పూను అల్లం తరుగు, 6 చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి రంగు మారుతున్నప్పుడు పసుపు వేసి కలపాలి. తర్వాత నూరి పెట్టుకున్న ముద్ద వేసి ఉప్పు, 2 కప్పుల నీరు చేర్చిఉడికించాలి. తర్వాత కోకుం వేసి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చేప ముక్కలు వేయాలి. మసాలా తగిలేలా ముక్కలన్నిటినీ కలిపి మూత ఉంచి ఉడికించాలి. చేపలు సగం ఉడికాక టమాటా ముక్కలు వేయాలి. పూర్తిగా ఉడికాక మంట తీసి 1 టే.స్పూను కొబ్బరి నూనె, కరివేపాకు వేసి కలిపి వడ్డించాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









