బాహుబలి టీం తో ఎమిరేట్స్‌ దురుసు ప్రవర్తన

- April 26, 2017 , by Maagulf
బాహుబలి టీం తో ఎమిరేట్స్‌ దురుసు ప్రవర్తన

ఇటీవల బాహుబలి చిత్ర బృందం ప్రచార కార్యక్రమం నిమిత్తం ప్రభాస్‌, అనుష్క, రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు దుబాయ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. కార్యక్రమం అనంతరం వీరంతా దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు ఎమిరేట్స్‌ విమానంలో బయలుదేరారు. వారంతా ఎయిర్‌పోర్ట్‌ గేట్‌ వద్దకు చేరుకోగానే విమాన సిబ్బంది చిత్రబృందంతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
‘ఎమిరేట్స్‌ ఈకే526 విమానంలో హైదరాబాద్‌ బయలుదేరాం. గేట్‌ వద్ద ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది మాతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. అందులో ఓ సిబ్బంది మాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. నేను తరచూ ఎమిరేట్స్‌ విమానంలో ప్రయాణిస్తుంటాను కానీ ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 8000 తెరల్లో బాహుబలి-ది కన్‌క్లూజన్‌’ విడుదల కాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com