అవార్డుకే నిండుదనం వచ్చింది అని చెప్పిన చిరంజీవి
- April 26, 2017
కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన సందర్భంగా మంగళవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పూల బొకేతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నాకు విశ్వనాథ్‌గారి ఉన్న అనుబంధం నటుడు, దర్శకుడు అనే కాకుండా కుటుంబపరమైంది కూడా. ఆయనకు ఈ అవార్డ్ రావడం చాలా గర్వంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతన్నా.అవార్డు రావాల్సిన సమయంలో వచ్చిందా, లేదా అనే దానిపై ఇప్పుడు మాటలు అనవసరం. నిజానికి ఈ అవార్డ్ ఎప్పుడో ఆయనకు రావాల్సింది. కానీ కాస్త ఆలస్యమైనా ఇప్పుడు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్లే అవార్డు రావడంతో ఆ అవార్డుకే నిండుదనం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు మనస్పూర్తిగా శుభాభినందనలు తెలుపుతున్నా. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు కోరే మనిషిని' అని అన్నారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!







