ఏపీ సీఎంకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానం
- April 26, 2017
ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. కన్వెన్షన్ కు రావాలంటూ ప్రముఖులకు నాట్స్ ప్రతినిధులు ఆహ్వానాలు అందజేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబును నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ సంబరాల కమిటీ సమన్వయకర్త రవి అచంటతోపాటు ఇతర ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా చికాగోలో జూన్ 30 నుంచి మూడు రోజులపాటు జరిగే నాట్స్ కన్వెన్షన్ కు హాజరుకావాలని ఆహ్వానించారు. ఇటీవీల అమెరికాలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిని ప్రియాంక గోగినేని కుటుంబానికి నాట్స్ తరుఫున 10 లక్షల, 80 వేల రూపాయల చెక్కును సీఎం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం శాసనమండలి ఉపసభాపతి బుద్ధప్రసాద్ కు కూడా ఆహ్వానం అందించారు. అంతకుముందు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతోపాటు.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావును లిశారు. ఈ సందర్భంగా నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







