ఏపీ సీఎంకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానం

- April 26, 2017 , by Maagulf
ఏపీ సీఎంకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. కన్వెన్షన్ కు రావాలంటూ ప్రముఖులకు నాట్స్ ప్రతినిధులు ఆహ్వానాలు అందజేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబును నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ సంబరాల కమిటీ సమన్వయకర్త రవి అచంటతోపాటు ఇతర ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా చికాగోలో జూన్ 30 నుంచి మూడు రోజులపాటు జరిగే నాట్స్ కన్వెన్షన్ కు హాజరుకావాలని ఆహ్వానించారు. ఇటీవీల అమెరికాలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిని  ప్రియాంక గోగినేని కుటుంబానికి నాట్స్ తరుఫున 10 లక్షల, 80 వేల రూపాయల చెక్కును సీఎం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం శాసనమండలి ఉపసభాపతి బుద్ధప్రసాద్ కు కూడా ఆహ్వానం అందించారు. అంతకుముందు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతోపాటు..  సుప్రీం కోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావును లిశారు. ఈ సందర్భంగా నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com