బాహుబలి టీం తో ఎమిరేట్స్ దురుసు ప్రవర్తన
- April 26, 2017
ఇటీవల బాహుబలి చిత్ర బృందం ప్రచార కార్యక్రమం నిమిత్తం ప్రభాస్, అనుష్క, రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. కార్యక్రమం అనంతరం వీరంతా దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఎమిరేట్స్ విమానంలో బయలుదేరారు. వారంతా ఎయిర్పోర్ట్ గేట్ వద్దకు చేరుకోగానే విమాన సిబ్బంది చిత్రబృందంతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘ఎమిరేట్స్ ఈకే526 విమానంలో హైదరాబాద్ బయలుదేరాం. గేట్ వద్ద ఎయిర్‌లైన్స్ సిబ్బంది మాతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. అందులో ఓ సిబ్బంది మాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. నేను తరచూ ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తుంటాను కానీ ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 8000 తెరల్లో బాహుబలి-ది కన్‌క్లూజన్’ విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







