ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు విద్యాసాగర్ రావు కన్నుమూత
- April 29, 2017
ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు కన్నుమూశారు. ఎక్స్టెన్సివ్ మెటస్టాటిక్ బ్లాడర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఉదయం 11.23 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొంత కాలంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉండటంతో కొన్నాళ్లుగా వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొని, సాగునీటి విషయంలో రాష్ట్రం ఆవశ్యకత గురించి ఆయన ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆయన అత్యంత సన్నిహితులు. ఇటీవలే ఆయనను కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. 'విద్యన్నా.. నేను కేసీఆర్‌ను' అంటూ పలకరించారు.
సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించి రిటైరైన విద్యాసాగర్ రావు.. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయనను కేసీఆర్ సర్కారు సాగునీటి ముఖ్య సలహాదారుగా నియమించింది. కాగా విద్యాసాగర్ రావు రెండేళ్లుగా కేన్సర్‌తో బాధ పడుతున్నారు. ఏడాది క్రితం అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. తిరిగి నగరానికి వచ్చినతర్వాత కూడా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. దాంతో ఈనెల 22న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చి అప్పటినుంచి కీమోథెరపీ అందించారు. అయినా ఫలితం లేకపోయింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







