దావూద్ ఇబ్రహీంకు గుండెపోటు
- April 29, 2017
మేనల్లుడి పనైపోయింది.. ఇక చిన్నమ్మకు ఉచ్చు బిగుసుకుంటోంది. అవును.. రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపే ప్లాన్.. శశికళ మదిలోంచే పుట్టిందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. దీనికి ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ.. ఈ కేసులోనూ అరెస్టయ్యే అవకాశం మెండుగా కన్పిస్తోంది. అధికారం కోసం శశికళ వేసిన ఎత్తులన్నీ చిత్తవడమే కాదు.. ఇప్పుడామె మెడకు మరో కేసు బిగుసుకుంటోంది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వజూపిన కేసులో.. దినకరన్ తో పాటు శశికళపైనా కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. లంచం వ్యవహారం సూత్రధారి శశికళేనని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్తున్నారు. ఆమె సూచన మేరకే దినకరన్ ఈ కథ నడిపారనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. లంచం కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు వేగం పెంచారు. బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ ను ఇదివరకే అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా ఓ హవాలా ఆపరేటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హవాలా వ్యాపారి ద్వారానే సుఖేష్ కు దినకరన్ అడ్వాన్స్ సొమ్ము అందజేశాడని సమాచారం. అలాగే సుఖేష్ అనుచరుడిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు దినకరన్ తో సహా ఐదుగురు అరెస్టయ్యారు. ఇక ఇదే కేసులో శశికళపై అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ ఇప్పటికే బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ.. తర్వాత ముఖ్యమంత్రి కావడానికి పావులు కదిపారు. ఈలోగా సుప్రీం కోర్టు తీర్పుతో జైలుకువెళ్లారు. తన మేనల్లుడు దినకరన్ ను ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలిపించడానికి ఓటర్లకు డబ్బులు పంచడం, రెండాకుల గుర్తు కోసం లంచం ఇవ్వజూపడం అంతా శశికళ ప్లాన్ అంటున్నారు. ఈ కేసులోనూ శశికళను అరెస్ట్ చేస్తే ఆమెకు చిక్కులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళ రాజకీయాల్లో, అన్నాడీఎంకేలో శశికళకు ఏమాత్రం ప్రాధాన్యం లభించే అవకాశం లేదు. ఇలా మన్నార్ గుడి మాఫియా ఖేల్ ఖతం అయినట్లేనంటున్నారు విశ్లేషకులు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







