గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరో రికార్డు
- April 29, 2017
ప్రముఖ సెర్చి ఇంజీన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (44 ) అందిన పరిహారం ఎంత పెరిగిందో తెలుసా? అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా టాప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ లిస్ట్ లో చేరిన పిచాయ్ 200 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ సొంతం చేసుకొని మరోసారి రికార్డు సృష్టించారు. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సుందర్‌కు 200 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్ యూనిట్లను ఆయనకిచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 12,855కోట్లకు చేరింది. 2015 స్టాక్ అవార్డు సుమారు 99.8 మిలియన్ డాలర్లకు ఇది రెట్టింపు.
యూ ట్యూబ్ వ్యాపారంతోపాటు, ప్రధానమైన యాడ్స్ బిజినెస్‌ద్వారా గూగుల్ ఆదాయానికి మంచి బూస్ట్ఇచ్చినందుకుగాను పిచాయ్ కి ఈ భారీ కాంపన్సేషన్ లభించింది. అలాగే మెషీన లెర్నింగ్, హార్డ్ వేర్ , క్లౌడ్ కంప్యూటింగ్ పెట్టుబడుల ద్వారా ఈ గ్రోత్ సాధించారని సీఎన్ఎస్ నివేదించింది. అనేక విజయవంతమైన ప్రాజెక్టులను లాంచ్ చేసినందుకు సంస్థ పరిహార కమిటీ ఈ విలాసవంతమైన పరిహారం చెల్లించిందని తెలిపింది. భారత సంతతికి చెందిన పిచాయ్ 2015 నాటి వేతనంతో పోలిస్తే ఇది రెండింతలు పెరిగింది. అయితే 2015 లో 652,500 డాలర్లను ఆర్జించిన పిచాయ్, గత ఏడాది ఈ వేతనం కొంచెం క్షీణించి 650,000డాలర్లు (రూ.667 కోట్లు) వేతనాన్ని పొందారు
అల్ఫాబెట్ స్టాక్ వాల్యూ ఈనెలలో భారీగా పుంజుకుంది. మొదటిసారి దీని మార్కెట్ క్యాప్ 600 బిలియన్ డాలర్లకు చేరింది.
కాగా 2004 సంవత్సరంలో గూగుల్‌లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా కేరీర్‌ను ఆరంభించిన పిచాయ్ 2015 ఆగస్టులో సంస్థ పునఃనిర్మాణ సమయంలో సీఈవో పదవిని చేపట్టారు. 2016లో 199 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డును అందుకున్నారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







