బ్రిటన్‌ నుంచి చైనా చేరుకున్న తొలిరైలు

- April 29, 2017 , by Maagulf
బ్రిటన్‌ నుంచి చైనా చేరుకున్న తొలిరైలు

బ్రిటన్‌ నుంచి చైనాకు బయలుదేరిన తొలి గూడ్స్‌ రైలు 12వేల కిలోమీటర్లు ప్రయాణించి శనివారం చైనాలోని యివు నగరానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గాల్లో ఇది రెండోది. పశ్చిమ యూరప్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చైనాకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడనుంది. లండన్‌ నుంచి ఏప్రిల్‌ 10న బయలుదేరిన ఈ రైలు 20 రోజుల పాటు ఏడు దేశాల గుండా ప్రయాణించి చైనా చేరుకుంది. రైలు మార్గంలో ఫ్రాన్స్‌, జర్మనీ, పోలాండ్‌, బెలారస్‌, రష్యా, కజకిస్థాన్‌ ఉన్నాయి. రైలులో వైన్‌, పాలు, ఔషధాలు, యంత్రాలు రవాణా అయ్యాయి. వస్తురవాణా కోసం చైనా రైల్వే కార్పొరేషన్‌ సమర్థమైన నెట్‌వర్క్‌ ఏర్పరుస్తోంది. ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన 15వ నగరం లండన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com