భారీ భూకంపం, సునామీ హెచ్చరిక ఫిలిప్పీన్స్లో
- April 29, 2017
ఫిలిప్పీన్స్లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. దీని ప్రభావం వల్ల పలు భవంతులు దెబ్బతినగా, ఇద్దరు గాయపడ్డారు. ప్రభుత్వ భవనాలు బీటలుబారాయి. సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
మిండనావో ద్వీపంలో 41 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. జనం నిద్రపోతున్న సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భయంతో నిద్రలేచి, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు హడావుడిగా బయటకు వెళ్లే ప్రయత్నంలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఈ నెల 12న మిండనావోలోనే సంభవించిన భూకంపంలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. గత ఫిబ్రవరిలో మిండనావోలోని సురిగావోలో వచ్చిన భూకంపం వల్ల ఎనిమిదిమంది మరణించగా, మరో 250 మందికిపైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









