బిగిసిన ఉక్కు పిడికిలి..మేడే
- April 30, 2017
పెట్టుబడిదారి వ్యవస్థపై బడుగు కార్మికుడు పిడికిలి ఎత్తిన ధైర్యం. దోపిడీ దారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కార్మికులకు స్పూర్తినిచ్చిన క్షణం. హక్కుల కోసం రోడ్డెక్కి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల సంస్మరణ దినం. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే.... అది నేడే. ఈ స్ఫూర్తితోనే గత 131 ఏళ్ళుగా ప్రపంచ వ్యాపితంగా మే డే పీడిత, తాడిత శ్రామిక జనా వళికి పోరాడే శక్తిని కలిగిస్తున్నది. రోజంత చెమటొడ్చి పనిచేసే కార్మికుడి సత్తా తెలియజేసే రోజు ఇది. తన హక్కుల కోసం పెట్టుబడిదారులపైకి ఎదురుతిరిగిన సాహసికుడు. శ్రమదోపిడీని నిరసిస్తూ... యావత్ ప్రపంచ కార్మికులకు స్పూర్తినిస్తూ... వేసిన ముందడుగే మే డే. పెట్టుబడిదారి, దోపిడివర్గాల అక్రమాలకు శ్రమ దోపిడికి గురైన కార్మికులు 1886 మే 1 వ తేదీన అమెరికాలోని చికాగోలో 18 గంటల పనివిధానం వ్యతిరేకిస్తూ 8 గంటల పనివిధాన పద్ధతి ప్రవేశపెట్టాలని కోరుతూ పోరాటానికి దిగారు.ఆ ఉద్యమంలో అనేకమంది కార్మికులు అమరులై తమ హక్కును సాధించుకున్నారు వారి స్పూర్తికి గుర్తుగా జరుపుకోనేదే అంతర్జాతీయా కార్మిక దినోత్సవం మేడే. అలా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో కార్మికులు మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. మన దేశంలో మొట్టమొదటి సారి మద్రాసు కేంద్రంగా 1923వ సంవత్సరం మే1వ తేదిన లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ అధ్వర్యంలో మే డే ఉత్సవాలను నిర్వహించారు. దేశంలో, రాష్ట్రంలో కుడా అనేక వర్గాల కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాటాలు సాగిస్తునే ఉన్నారు. 18వ శతాబ్ధంలో ఇంగ్లండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం ఫలితంగా పెట్టుబడిదారీ వర్గం అభి వృద్ది చెంది నూతన పరిశ్రమలు ప్రపంచ వ్యాపితంగా ఆవిర్భ వించిన ఫలితంగా పెట్టుబడిదారీ దోపిడీ పై సమర శంఖం పూరి స్తూ 18వ శతాబ్ధంలో యూరప్‌ఖండంలో పారిశ్రామిక కార్మికవర్గ ఆవిర్భావం జరిగింది. 19వ శతాబ్ధం ఆరంభంలో ప్రపంచ వ్యాపితంగా యూరప్, అమెరికా ఖండాలలో కార్మికులను 14 నుండి 18 గంటల వరకు యజమానులు అమానుషంగా పని చేయించే వారు. సూర్యోదయం కాకముందు నుండి సూర్యాస్త మయం తర్వాత కూడా పనిచేసే నిర్భంధ పని విధానం అమలు జరిగింది. కటిక చీకటిలో, మురికి కూపాలలో ఎటువంటి మౌలిక సదుపాయాలు, గాలి, వెలుతురు లేని పరిస్థితుల్లో చాలీచాలని వేతనాలతో కార్మికవర్గం యాజమాన్యానికి కట్టుబానిసలవలే జీవిం చవలసి వచ్చింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెట్టుబడి దారీ దేశాలలో కార్మికవర్గం పోరాటాలను ప్రారంభిం చింది. తొలిరోజులలో 10 గంటల పనిదినాల కోసం అనేక పారిశ్రామిక వాడల్లో ఆందోళనలు ప్రారంభమైనాయి. 1827లో ఇంగ్లండ్‌లోని ఫిలడల్ఫియాలో మెకానిక్స్ యూనియన్ నాయ కత్వాన తొలి కార్మిక సమ్మె 10 గంటల పనిదినాలను డిమాండ్ చేస్తూ జరిగింది. 1834లో అమెరికాలోని న్యూయార్క్‌లో రోజుకు 18 గంటల నుండి 20 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మి కులు ఆందోళనలు చేశారు. నాటి నుండి అనేక దేశాలు, పట్ట ణాల్లో 10 గంటల పనిదినం కోరుతూ కార్మికులు పెద్దఎత్తున ఆందో ళనలు నిర్వహించారు. 1837లో కార్మికుల ఆందోళనకు తలొగ్గిన అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ 10 గంటల పని విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. అనంతరం 1856లో బిల్డింగ్ ట్రేడ్ వర్కర్స్ (ఆస్టేలియా) 8 గంటల పని, 8 గంటల రిక్రియేషన్, 8 గంటల విశ్రాంతి నినాదంతో ఉద్యమించి 8 గంటల పనివిధానాన్ని సాధించేందుకు ఉద్యమం నిర్వహించింది. 1866లో అమెరికాలోని బాల్టిమోర్‌లో 60 కార్మిక సంఘాల ప్రతినిధులు నేషనల్ లేబర్ యూనియన్ పేరుతో ఒక సంఘాన్ని స్థాపించారు. దీనికి విలియం హెచ్ సెల్విస్ నాయకత్వం వహించారు. ఈయన లండన్‌లోని ఫస్ట్ ఇంటర్నేషనల్ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకుని 8 గంటల పని కోసం ఆందోళన నిర్వహించారు. 1886లో అమెరికా నగరాల్లో 11,562 పరిశ్రమల్లో పనిగంటల తగ్గింపు డిమాండ్‌తో సమ్మెలు జరిగాయి. లక్షలాది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. 1886 మే 1వ తేదీ చికాగో నగరం కేంద్రంగా 8 గంటల పనిదినం కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది. చికాగోతో పాటు న్యూయార్క్, బాల్టిమోర్, వాషింగ్టన్, మిల్వాకి, సిన్సినాటి, సెంట్లూయీస్, ఫిట్స్‌బర్గ్, డెట్రాయిట్ మొదలైన నగరాల్లో కూడా సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెలలో 5 లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. " గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న కార్మిక సోదరులకు " మా గల్ఫ్ డాట్ కామ్ " మే డే శుభాకాంక్షలు !!
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









