ఒంటెలపై అల్‌ బతినా స్కూల్‌ విద్యార్థుల సందర్శన

- May 01, 2017 , by Maagulf
ఒంటెలపై అల్‌ బతినా స్కూల్‌ విద్యార్థుల సందర్శన

అల్‌ బతినా ఇంటర్నేషనల్‌ స్కూల్‌కి చెందిన గ్రేడ్‌ 7 స్టూడెంట్స్‌, ఒంటెలపై ఒమన్‌ అందాల్ని తిలకించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఐదు రోజులపాటు వాడిస్‌, మౌంటెయిన్స్‌ వంటి చోట్లా వీరి ప్రయాణం సాగింది. అల్‌ ఖాన్‌ విలేజ్‌ నుంచి ట్రెక్కింగ్‌తో వీరి ప్రయాణం ప్రారంభమయ్యింది. అక్కడినుంచి అల్‌ తుక్బా మీదుగా వీరి ప్రయాణం సాగింది. కొండలపై క్యాంప్‌లు నిర్వహించారు. స్విమ్మింగ్‌, మైంటెయిన్‌ క్లైంబింగ్‌ వంటివాటి ద్వారా విద్యార్థులు అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. రాత్రి వేళల్లో క్యాంప్‌ల వద్ద సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. చివరగా విద్యార్థులు బురైమిలోని లాస్ట్‌ డ్యూన్స్‌కి పంపబడ్డారు. అక్కడే విద్యార్థులు మరింత ఉల్లాసంగా గడిపారు. క్యామెల్‌ నిర్వాహకులకీ, క్యామెల్స్‌కీ మధ్య అనుబంధాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు తెలుసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com