వరస సినిమాలతో యంగ్ హీరో శర్వానంద్ బిజీ బిజీ
- May 02, 2017
యంగ్ హీరోల్లో శర్వానంద్ డిఫరెంట్ నేపద్య కథలతో వరస విజయాలను అందుకొంటున్నాడు.. సంక్రాంతికి భారీ విజయాన్ని అవార్డులతో పాటు రివార్డులను అందుకొన్న "శతమానం భవతి" సినిమా తర్వాత శర్వానంద్ తాజా సినిమా "రాధ" రిలీజ్ కు రెడీగా ఉన్నది. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవ్వడంతో శర్వానంద్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడు.. మారుతి దర్శకత్వంలో ఈ నెల 12 న ఓ సినిమా ప్రారంభించనున్న శర్వానంద్.. మరో సినిమాని కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.. దశరథ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండనున్నదని.. ఈ సినిమా కూడా పూర్తిగా కుటుంబ నేపద్య కథతో ఉండనున్నదని టాక్.. ఈ సినిమా స్టోరీని ఎప్పుడో శర్వానంద్ కు దశరథ్ వినిపించగా.. కథ నచ్చిన శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ఈ సినిమాను పట్టాలెక్కించే దిశగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్నది అని సమాచారం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









