బాహుబలి లో ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన టుస్సాడ్స్!
- May 03, 2017
బాహుబలితో ఒకేసారి నేషనల్ స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. అందుకేనేమో.. ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తన మ్యూజియంలో పెట్టుకుంటామంటూ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ముందుకొచ్చింది. గత ఏడాదిలోనే ప్రభాస్ కొలతలను కూడా తీసుకెళ్లారు. బ్యాంకాక్‌లో అతి త్వరలోనే ప్రభాస్ మైనపు బొమ్మ కొలువుదీరబోతోంది. దానికి సంబంధించిన ఫస్ట్లుక్నే విడుదల చేసింది మేడమ్ టుస్సాడ్స్. కాలకేయుడి తలను ఓ కిరీటంతో పట్టుకుని ఈడ్చుకువెళుతున్న స్టిల్‌లో ఈ విగ్రహం దర్శనమివ్వనుంది. కాగా, 'ఒక్క బాహుబలి.. వంద సినిమాలతో సమానం' అన్న ట్యాగ్ లైన్‌తో ప్రభాస్ బాహుబలి మైనపు బొమ్మ ఏర్పాటు కాబోతోంది. కాగా, మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు కాబోతున్న తొలి దక్షిణాది నటుడి విగ్రహం ప్రభాస్‌దే కావడం విశేషం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









