నమాజ్ కోసం మసీదుకు వెళ్లిన బాలుడి దారుణ హత్య
- May 05, 2017
నమాజ్ కోసం వెళ్లిన బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బండ్లగూడలో కలకలం సృష్టించింది. గత నెల 27న జహంగీరాబాద్ కు చెదిన పన్నెండేళ్ల ఉరూజుద్పద్దీన్ నమాజు కోసం మసీదుకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. బాలుడిని ఇంటి పక్కనే ఉన్న మునీర్ కిడ్నాప్ చేసి హత్య చేశాడని గుర్తించారు.
మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లిన మునీర్‌కు అతడి తల్లిదండ్రులను డబ్బు ఎలా డిమాండ్ చేయాలో తెలీలేదు. బాలుడిని తిరిగి తీసుకెళ్తతే తనపై కేసు నమోదు చేస్తారని భయపడ్డాడు. దీంతో చిన్నారి గొంతు నులుమి హత్య చేసి మృతదేహాన్ని మురికిగుంటలో పడేశాడు. పోలీసు విచారణలో నిజాలు వెల్లడించాడు. దీంతో గురువారం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతితో మహ్మద్ యావరుద్దీన్ కుటుంబంలో విషాదం అలుముకుంది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









