13న హైదరాబాద్ నగరంలో ఎన్‌ఆర్‌ఐ సదస్సు
- May 05, 2017
గల్ఫ్‌తో పాటు మలేసియా తదితర దేశాలకు వెళ్లిన ఎన్‌ఆర్‌ఐల సంక్షేమం, సమస్యలను పరిష్కరించే దిశగా తెలంగాణ రూపొందించే ఎన్‌ఆర్‌ఐ పాలసీకి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వంతుగా సహకరించేందుకు ముందుకొ చ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి సంయుక్తం గా ఈ నెల 13న హైదరాబాద్‌లో సదస్సును నిర్వహించనుంది. ప్రధానంగా ఎన్‌ఆర్‌ఐల భద్రత, సంక్షేమంలో పాటు రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్‌ఆర్‌ఐల భాగ స్వామ్యం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, మున్సి పల్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖల మంత్రి కె.తారకరామారావు శుక్రవారం సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
ప్రధా నంగా సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాల పై చర్చించారు. విదేశాలకు వెళ్లే వారికి పాస్‌పోర్టు మొదలు మైగ్రేషన్ తదితర సదుపాయాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా నగరంలో విదేశీ భవన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన స్థలాన్ని గుర్తించాలని అధికారు లను ఆదేశించారు. రాష్ట్రంలో, సొంత ప్రాం తాల్లో అభివృద్ధి పను లు చేపట్టేందుకు, తమ వంతు భాగ స్వామ్యంగా విరాళాలు ఇచ్చేందుకు ముందు కు వచ్చే ఎన్‌ఆర్‌ఐలకు అనుసంధానకర్త పాత్ర పోషించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







