ఫేక్ వీసా: వలసదారుడికి మూడేళ్ళ జైలు
- May 06, 2017
దోహా: దోహా క్రిమినల్ కోర్ట్ నేపాలీ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష, ఆ తర్వాత డిపోర్టేషన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 33 బిజినెస్ వీసాలు, అలాగే ఎంట్రీ వీసాలను అక్రమంగా తయారుచేస్తున్నందుకుగాను నిందితుడికి న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేయడం, అలాగే తన ఐడీని ఫేక్ వీసాల కోసం వినియోగించి, ఇతరులకు అమ్మినట్లు నేరం నిర్ధారణ అయ్యింది. 200 ఎంట్రీ వీసాల్ని 400,000 ఖతారీ రియాల్స్కి విక్రయించాడు ఏడాదిన్నర కాలంలోనే. కంపెనీకి సంబంధించిన కొన్ని పత్రాల్ని యజమాని రివ్యూ చేస్తున్నప్పుడు ఈ కుట్రకోణం బయటపడింది. యజమాని, నిందితుడి గురించి పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు విచారణ చేపట్టి, నిందితుడ్ని అదుపులోకి తీసుకుని అతని నుంచి వివరాలు రాబట్టారు.
తాజా వార్తలు
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్









