రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన బాహుబలి 2
- May 07, 2017
తెలుగు సినిమా కు ఇంతకన్నా గొప్ప స్థానం మరోటి ఉండదు..అసలు తెలుగు సినిమాకు ఈ స్థాయి ఉంటాది అని కూడా ఎవరు కలలో కూడా ఊహించలేదు.ఇంతకీ దేని గురించా అని అనుకుంటున్నారా.ఇంకా దేని గురించి దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన బాహుబలి 2 మూవీ గురించి మాట్లాడుతున్నాం..
విడుదలైన మొదటి రోజు నుండే రికార్డ్స్ సృష్టిస్తూ వస్తున్న ఈ మూవీ , తాజాగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ లో అడుగు పెట్టింది. బాహుబలి2 చిత్రం నిన్నటి వరకు 900 కోట్ల రూపాయలని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ రోజు ఆదివారం హాలీడే కావడంతో ఈ సినిమా థియేటర్స్ అన్ని హౌజ్ ఫుల్ అయ్యాయి. దీంతో బాహుబలి 2 చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ని ఈజీగా దాటింది. ఈ విషయాన్ని బాహుబలి టీం కూడా అఫీషియల్ గా ప్రకటించింది.
గతంలో ఏ భారతీయ చిత్రం కూడా ఈ మ్యాజిక్ ఫిగర్ ని అందుకోపోగా, బాహుబలి2 చిత్రం అవలీలగా ఈ రికార్డుని చెరిపేసింది. కేవలం వారం తిరిగే లోపే ఈ రికార్డు సాధించడం ఒక్క బాహుబలి కే చెల్లిందని అంత మాట్లాడుకుంటున్నారు. చిత్ర యూనిట్ తో పాటు , ప్రభాస్ తన అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









