విమానాన్ని వదిలి గుర్రుపెట్టి నిద్రపోయిన పైలెట్
- May 07, 2017
ఇస్లామాబాద్: 305 మంది ప్రాణాలను ఫణంగా పెట్టాడు ఓ విమాన పైలెట్. జూనియర్ పైలెట్ కు విమానాన్ని అప్పగించి రెండుగంటలపాటు విమానంలోనే తీరిగ్గా నిద్రపోయాడు. అయితే ఈ విషయాన్ని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పాకిస్తాన్ నుండి లండన్ కు బయలుదేరిన విమానంలో పాక్ కు చెందిన సీనియర్ పైలెట్ అమిర్ అఖ్తర్ హంషీ శిక్షణలో ఉన్న పైలెట్ లకు వదిలేసి రెండున్నర గంటలపాటు నిద్రపోయాడు.
అక్కడే ఉన్న ఓ ప్రయాణీకుడు అతడు నిద్రపోతున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
ఈ విషయమై విమానాయాన అధికారులకు కూడ ఫిర్యాదు చేశాడు.ఈ ఘటన గత నెల 26వ, తేదిన చోటుచేసుకొంది. ఈ ఘటనపై పాక్ అధికారులు విచారణకు ఆదేశించారు.
రెండుగంటలపాటు బిజినెస్ క్లాస్ లో సీనియర్ పైలెట్ బిజినెస్ క్లాస్ లో నిద్రపోయాడు. విమానం టేకాఫ్ అయిపోయిన వెంటనే జూనియర్ పైలెట్లకు వదిలేసి నిద్రపోయాడు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







