చెన్నైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది .. నలుగురు మృతి

- May 07, 2017 , by Maagulf
చెన్నైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది .. నలుగురు మృతి

 చెన్నైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అగ్నికి అహూతయ్యారు. వడపళనిలోని అపార్ట్ మెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇవి క్రమంగా అపార్ట్ మెంట్ అంతటా వ్యాపించాయి. దీంతో మీనాక్షి, పెల్వి, షాలిని, సంజయ్ మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సెల్లార్ లోని 21 బైక్ లు దగ్ధమయ్యాయి. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com