యూఏఈ సెలూన్‌లో 'సెల్ఫీ' గొడవ

- May 08, 2017 , by Maagulf
యూఏఈ సెలూన్‌లో 'సెల్ఫీ' గొడవ

షార్జాలోని ఓ సెలూన్‌లో 'సెల్ఫీ' గొడవ జరిగింది. ముగ్గురు అరబ్‌ మహిళలు, జిసిసి మహిళ ఒకరిపై దాడి చేశారు. ఓ పార్టీకి వెళ్ళేందుకోసం సెలూన్‌కి వచ్చిన మహిళలు, సెల్ఫీ తీసుకుంటుండగా ఈ గొడవ జరిగింది. జిసిసి మహిళ వెనకాల నిలబడి ఉన్న సమయంలో ఆ ముగ్గురు మహిళలు సెల్ఫీ తీసుకోవడం వివాదాస్పదమయ్యింది. సెలూన్‌ నిర్వాహకులు ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా 'జగడం' ఆగలేదు. ఈ ఘటనలో జిసిసి మహిళ బొటనవేలికి గాయమయ్యింది. అలాగే ఆమె శరీరంపైనా చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అరబ్‌ మహిళలు తీసుకున్న సెల్ఫీలో తన ఫొటో ఉండడంపై జిసిసి మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆమె అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దురుసుగా వ్యవహరించిన అరబ్‌ మహిళలు ఈ ఘటనకు బాధ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com