ఓలాతో చేతులు కలిపిన భారతి ఎయిర్‌టెల్‌

- May 08, 2017 , by Maagulf
ఓలాతో చేతులు కలిపిన భారతి ఎయిర్‌టెల్‌

కస్టమర్లకు పలు రకాల డిజిటల్‌ సర్వీసులు అందించే నిమిత్తం క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలాతో భారతి ఎయిర్‌టెల్‌ జట్టుకట్టింది. ఇందులో భాగంగా ఓలా యాప్‌తో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఇంటిగ్రేట్‌ అవుతుంది. ఫలితంగా వినియోగదారులు తమ ఓలా ప్రయాణాలకు సులభంగా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. అదే విఽధంగా ఓలా మనీ (ఓలా మొబైల్‌ వాలెట్‌) మై ఎయిర్‌టెల్‌ యాప్‌, ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌తో ఇంటిగ్రేట్‌ అవుతుంది. దీని వల్ల ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ మొబైల్‌/డిటిహెచ్‌ కనెక్షన్లకు రీచార్జ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఓలా రైడ్‌ను బుక్‌ చేసుకోవాలనుకునే వారికి ఎయిర్‌టెల్‌ రిటైల్‌ పాయింట్లు సహకారం అందించనున్నాయి. రెండు సంస్థల కలయిన మూలంగా కస్టమర్లకు మరిన్ని సర్వీసులు అందించే అవకాశం ఏర్పడుతుందని భారతి ఎయిర్‌టెల్‌ ఎండి, సిఇఒ (భారత్‌, దక్షిణాసియా) గోపాల్‌ విట్టల్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com