మందుల దొంగతనం: ఇద్దరు ఆసియన్లపై విచారణ

- May 09, 2017 , by Maagulf
మందుల దొంగతనం: ఇద్దరు ఆసియన్లపై విచారణ

రస్‌ అల్‌ ఖైమా క్రిమినల్‌ కోర్ట్‌, ఇద్దరు ఆసియా వ్యక్తులు, నార్కోటిక్‌ ట్రమడాల్‌ పిల్స్‌ని దొంగిలించిన కేసులో విచారణ ప్రారంభించింది. ఆ ఇద్దరు వ్యక్తులపై, వారు పనిచేస్తున్న ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరిలో ఒకరు ఆసుపత్రిలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నారు. ఐదు ట్యాబ్లెట్లుగల స్ట్రిప్‌ని దొంగిలించినట్లుగా ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. ఆసుపత్రి ఫార్మసీ నుంచి ఈ నార్కోటిక్‌ డ్రగ్‌ గల ట్యాబ్లెట్‌ స్ట్రిప్‌ని అతను దొంగిలించాడు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ప్రిస్క్రిప్షన్‌ ఓన్లీ మెడిసిన్‌ని కన్‌జంప్షన్‌ కోసమే దొంగిలించినట్లు పేర్కొన్నాడు. ఆసుపత్రి మెడికల్‌ షాప్‌ నుంచి దొంగిలించిన ట్యాబ్లెట్‌ స్ట్రిప్‌ని, మొదటి నిందితుడు తన స్నేహితుడైన రెండో నిందితుడికి అందించాడు. రెండో నిందితుడు, దాన్ని ఎవరి కంటపడకుండా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆసుపత్రి ఫిర్యాదు మేరకు సకాలంలో స్పందించిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. ఇంకో వైపున రస్‌ అల్‌ఖైమా క్రిమినల్‌ కోర్ట్‌ మరో కేసులో అరబ్‌ మహిళకు ఏడేళ్ళ జైలు శిక్ష, డిపోర్టేషన్‌ని విధించింది. 15,000 ట్రమడాల్‌ ట్యాబ్లెట్స్‌ని తరలిస్తుండగా ఆమె రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com