భారతీయుడికి అమెరికా సైన్యంలో ఉద్యోగం జీతం ఎంతో తెలుసా??
- May 09, 2017
భారతీయులకు అమెరికా సైన్యంలో ఉద్యోగం రావడం అంటేనే విచిత్రం అనుకుంటే.. అది కూడా కళ్లు తిరిగే ప్యాకేజి వచ్చింది. జైపూర్‌కు చెందిన మోనార్క్ శర్మ అనే యువకుడికి అమెరికా సైన్యంలోని ఏహెచ్-64ఇ కంబాట్ ఫైటర్ హెలికాప్టర్ యూనిట్‌లో శాస్త్రవేత్తగా ఉద్యోగం వచ్చింది. టెక్సాస్‌లోని ఫోర్ట్ హూడ్‌లోని ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు అతడికి ఏకంగా రూ. 1.20 కోట్ల వార్షిక ప్యాకేజి దక్కింది. అంటే నెలకు 10 లక్షలు అన్నమాట. అమెరికా ఆర్మీలోకి ఈ సంవత్సరమే ప్రవేశించిన ఈ ఫైటర్ హెలికాప్టర్ల డిజైన్‌ను పరిశీలించడం, వాటిని తనిఖీ చేయడం, ఉత్పత్తి, నిర్వహణ బాధ్యతలను అతడు చూసుకోవాల్సి ఉంటుంది. 2013లో నాసాలో జూనియర్ రీసెర్చ్ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మోనార్క్ శర్మ.. అక్కడి మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పనిచేశారు. తర్వాత 2016 మే నుంచి అమెరికా ఆర్మీలోకి ప్రవేశించారు. కొద్ది నెలల్లోనే డిజైనింగ్, రీసెర్చ్ విభాగాల్లో తన నైపుణ్యాన్ని ఆయన నిరూపించుకున్నారు. దాంతో అదే సంవత్సరంలో రెండు ప్రతిష్ఠాత్మమైన మెడల్స్ ఆర్మీ సర్వీస్ మెడల్, సేఫ్టీ ఎక్స్‌లెన్స్ అవార్డు వచ్చాయి. రాజస్థాన్‌లో ఒక ప్రభుత్వోద్యోగి రాకేష్ శర్మ కుమారుడైన మోనార్క్.. ముందునుంచి అంతరిక్ష శాస్త్రం, డిఫెన్స్ పరికరాల రంగంలో ఆసక్తి కలిగి ఉండేవాడు. తనకు భారత సైన్యంలో పనిచేసే అవకాశం రాలేదని, అయితే అమెరికా సైన్యంలో తాను చేసే పనితో స్వదేశానికి మంచిపేరు తెస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









