హీరోయిన్ కీర్తి సురేషే కావాలంటున్న హీరో విక్రమ్
- May 09, 2017
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ యాక్టర్స్ , ఆర్టిస్టులకు , టెక్నిషియన్స్‌కు డిమాండ్ ఉంటుంది. ఒక సినిమా హిట్టైన ఆఫర్స్ వారిని తరుముతు ఉంటాయి. హ్యాట్రిక్ సక్సెస్‌తో హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఆఫర్స్ వెంటాడుతున్నాయి. కీర్తి సురేష్ జోరు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో మామూలుగా లేదు. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతోనూ వరుసగా ఫిల్మ్ చేసేస్తుంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించటంతో ఆమెకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కూడా కీర్తి డేట్స్ కోసం తానే అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. విలక్షణ నటుడిగా నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్, మాస్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ హరి దర్శకత్వంలో సామి 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్గా తీసుకోవాలని నిర్ణయించారు. ఐతే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కీర్తి బిజీగా ఉండటంతో ఆమె డేట్స్‌కు తగ్గట్టుగా విక్రమ్ తన డేట్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. కొంత కాలంగా తన రేంజ్‌కు తగ్గ హిట్ ఇవ్వలేకపోతున్న విక్రమ్ కూడా కీర్తి లక్ మీద నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









