అల్ ఇంజాజ్ ప్రైవేట్ స్కూల్ 12 గ్రేడ్ విద్యార్థులకు వీడ్కోలు
- May 10, 2017
అల్ ఇంజాజ్ ప్రైవేట్ స్కూల్ ఇటీవల క్రౌనే ప్లాజా మస్కాట్ లో ఒక గ్రాడ్యుయేషన్ వేడుకను నిర్వహించింది, ఆ పాఠశాల యొక్క మూడవ బ్యాచ్ 12 తరగతి విద్యార్థులు ఈ ఏడాది ఉత్తీర్ణమయ్యారు. శ్రీశ్రీ సయ్యిద్ లోయ్ గాలిబ్ ఖాలిద్ ఆల్ సయిద్, ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.పాఠశాల డైరెక్టర్ అమిటా శర్మ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగాఆయన ప్రసంగిస్తూ విద్యార్థులు వారి స్వంత సామర్థ్యాలపై నమ్మకం పెంపొందించుకోవాలని వారికి ఆయన సలహా ఇచ్చారు . ఆ ఉద్వేగభరితమైన కృషికి ఎల్లప్పుడూ బహుమానాలు దక్కుతాయని అయన అన్నారు.12 వ తరగతి విద్యార్ధులు పాఠశాలకు, వారి ఉపాధ్యాయులకు తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ ఒక పాటను సమర్పించారు. అదేవిధంగా గ్రేడ్ 12 విద్యార్థులకు అరబిక్ మరియు ఆంగ్లంలో అభినందనలు మరియు వీడ్కోలు తెలియచేస్తూ11 వ తరగతి విద్యార్థులు చక్కని పాటలు పాడారు. సాయంత్రం ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టమైన అంశంలో ముఖ్య అతిధి నుండి పలువురు విద్యార్థులు ట్రోఫీలను అందుకున్నప్పుడు వారి మొహాలు వెలిగిపోయాయి. విద్యార్థులకు తాము చదువుకొన్న జ్ఞాపకం పదిలపర్చుకొనేలా ఫోటోగ్రాఫిక్ కార్యక్రమం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నా విద్యార్థుల యొక్క ప్రతి తల్లితండ్రుల ముఖం మీద చిరునవ్వు ఆనంద బాష్పాలు ఈ అద్భుతమైన కార్యక్రమంలో చూడటం జరిగింది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









