ప్రధాని నరేంద్రమోదీతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ భేటీ

- May 10, 2017 , by Maagulf
ప్రధాని నరేంద్రమోదీతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్‌ జగన్‌ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బుధవారం  ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధానికి నివేదించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు అయ్యేలా తక్షణమే పరిష్కారం చూపాలని వైఎస్‌ జగన్‌...ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, మిర్చి రైతుల సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి సాయం, పార్టీ ఫిరాయించిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం కల్పించడం తదితర అంశాలను వైఎస్‌ జగన్‌... ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. ప‍్రధానిని కలిసినవారిలో వైఎస్‌ జగన్‌తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి,మిథున్‌ రెడ్డి ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com